నాలుగు మెడికల్ కాలేజీలకు పర్మిషన్

by Gantepaka Srikanth |
నాలుగు మెడికల్ కాలేజీలకు పర్మిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) లెటర్ ఆఫ్​పర్మిషన్(ఎల్‌వోసీ) జారీ చేసింది. వాస్తవానికి 2024–25 అకాడమిక్ ఇయర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 8 కాలేజీలను అప్లై చేయగా, కేవలం నాలుగు కాలేజీలకు మాత్రమే అనుమతులు వచ్చాయి. ములుగు, నర్సంపేట్, గద్వాల, నారాయణపేట్ కాలేజీలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్భుల్లాపూర్, మెదక్ కాలేజీలకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఆయా కాలేజీల అనుమతులు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎన్ఎంసీకి అప్పీల్ చేయనున్నది. ఇదిలా ఉండగా, ఇటీవల నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త కాలేజీల్లో తనిఖీలు చేసింది. స్టాఫ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొరత ఉన్నట్లు గుర్తించిన ఎన్ఎంసీ, గత నెల 8న పలు రీమార్క్స్‌తో అన్ని కాలేజీలకు లేఖ రాసింది. ఎన్ఎంసీ సూచించిన విధంగా వైద్యశాఖ పలు మార్పులు చేయగా, మళ్లీ నాలుగు కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇవ్వడం గమనార్హం. మిగతా కాలేజీల్లోనూ మార్పులు చేసి అప్పీల్‌కు వెళ్లనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Advertisement

Next Story