- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉత్కంఠగా ఎదురుచూపు.. ఆ ఎనిమిది మంది సురక్షితంగా తిరిగి రావాలని పూజలు

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/అచ్చంపేట: శ్రీశైల మల్లన్న.. బతుకుతెరువును వెతుక్కుంటూ.. మీ సన్నిధికి వచ్చి పనులు చేసుకుంటూ అనుకోని ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిని కాపాడి.. వారిని ప్రాణాలతో తిరిగి వచ్చేలా చూడు స్వామి అంటూ ప్రజలంతా శ్రీశైలం మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నారు.. నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న పనులలో విధులు నిర్వహించేందుకు శనివారం ఉదయం 52మందికి పైగా సిబ్బంది, కార్మికులు వెళ్లగా.. అనుకోకుండా టన్నెల్లో ఒక్కసారిగా నీళ్లు.. మట్టిపెద్ద ఎత్తున శబ్దం చేస్తూ పనులు జరుగుతున్న ప్రదేశంలో కులాయి.. వెంటనే పనులు చేస్తున్న కార్మికులు.. సిబ్బంది ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు వచ్చారు. ముగ్గురు కార్మికులు గాయపడటంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయం పాఠకులకు విధితమే.. మొత్తం ఎనిమిది మంది పనులు చేస్తున్న కంపెనీల సిబ్బంది ఆచూకీ లేకుండా పోయింది. మిగతా కార్మికులు అందరూ ప్రమాదం జరిగిన సంఘటనకు ఇటువైపు ఉన్న కారణంగా వారు ప్రాణాలతో బయటపడ్డారు.
కానీ, సంఘటన జరగడానికి అటువైపు ఉన్న కార్మికులు సిబ్బంది బయటకు రాలేక, అక్కడే ఉండి పోవడంతో.. అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఆ 8మంది సురక్షితంగా ఉన్నారా..?? లేదా మట్టి.. నీళ్లల్లో కలిసిపోయారా..!!? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ డాక్టర్ మల్లు రవి.. నల్లగొండ నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది సంఘటన జరగడానికి గల కారణాలను తెలుసుకుని. సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆచూకీ లభించని వారిని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సహాయ కార్యక్రమాలు కొన సాగుతున్నాయి. జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రత్యేక బృందాలలో ఒక బృందం ఆచూకీ లేని వారి వివరాలను కనుగొనేందుకు టన్నెల్లోకి వెళ్లారు. కాగా, ప్రమాద స్థలానికి అటువైపు ఉన్న 8మంది సిబ్బంది, ఉద్యోగులు క్షేమంగా ఉండాలని, బతుకు బండిని సాగించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా.. ప్రాణాలతో బయటకు రావాలని అందరూ తమ తమ మనసులలో శ్రీశైల మల్లికార్జునిడిని వేడుకోవడంతో పాటు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తెల్లవార్లు గాలింపు చర్యలు..
రెస్క్యూ బృందాలు కనిపించకుండగా పోయిన 8మందిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోగా, ఒక బృందం ముందుగా వారి ఆచూకీ కోసం చేపట్టాల్సిన సహాయ కార్యక్రమాలను గురించి అంచనా వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య టన్నెల్లోకి వెళ్లారు. వారి ప్రయత్నాలు ఫలించాలని అందరూ వారి వారి దేవుళ్లను ప్రవర్తిస్తున్నారు. తెల్లవారులు సహాయ కార్యక్రమాలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.