Judge: జస్టిస్ యశ్వంత్ వర్మపై 2018లోనే సీబీఐ కేసు

by Shamantha N |
Judge: జస్టిస్ యశ్వంత్ వర్మపై 2018లోనే సీబీఐ కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయితే, ఇవి దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. కాగా.. ఇప్పుడు జస్టిస్ వర్మపై నమోదైన సీబీఐ కేసు బయటపడింది. 2018లో జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సింబాలి షుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. దానికి ఆ సమయంలో ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అప్పుడ జస్టిస్ వర్మ నివాసంలో లెక్కల్లో చూపని నగదు భారీ దొరిగింది. దీంతో, రంగంలోకి దిగిన సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. అయితే 2012 సంవత్సరంలో జనవరి, మార్చి నెలల మధ్యలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కి సింబాలి షుగర్ మిల్స్ వందల కోట్లలో టోకరా వేసి ఘటన అప్పట్లో సంచలనమైంది. ఆ బ్యాంకు నుంచి సుమారు రూ. 148.59 కోట్లను అక్రమ మార్గంలో సింబాలి షుగర్ మిల్స్ ఖాతాలోకి మళ్లించారు. 5వేలు మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి బ్యాంక్ రుణానికి వెళ్లి, ఆ రైతుల పేర్లతో తప్పుడు పత్రాలు(KYC) సృష్టించి మోసానికి తెరలేపారు.

2015లో ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు

కాగా.. 2015లో ఓబీసీ బ్యాంకు ఈ విషయాన్ని గమనించింది. ఆ రుణం మోసం చేసి తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో మొత్తం రుణం రూ. 97.85 కోట్లు కాగా, అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ. 109 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. దీనిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన గుర్పాల్ సింగ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కి గుర్పాల్ సింగ్ అల్లుడు కావడం గమనార్హం. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎప్ఐఆర్ ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసుపై దర్యాప్తు చేశాయి. అయితే ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో దర్యాప్తు అంశం పక్కకు పోయింది. కాగా.. 2023లోఈ అంశాన్ని అలహాబాద్ హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా అవినీతిపై దర్యాప్తు కచ్చితంగా సమగ్రంగా జరగాలని పేర్కొంది. ఇందులో రుణాలు ఎగవేతకు సంబంధించి ఏడు బ్యాంకులను లింక్ చేసింది. సుమారు ఏడు బ్యాంకులు కలిపి రూ. 900 కోట్లు సింబాలి షుగర్ మిల్స్ కు రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించింది. దాంతో 2024 ఫిబ్రవరిలో సీబీఐ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెకర్లపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి విచారణను తిరిగి ప్రారంభించింది.

Next Story

Most Viewed