ఉద్యోగులకు బెదిరింపు కాల్స్.. ఎవరు ఆ ఫుడ్ ఆఫీసర్..

by Sumithra |
ఉద్యోగులకు బెదిరింపు కాల్స్.. ఎవరు ఆ ఫుడ్ ఆఫీసర్..
X

దిశ, అచ్చంపేట : సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలను వేస్తూ ఆన్లైన్ల్ ద్వారా ప్రజలను అతి సులువుగా మోసం చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. అయితే ఒక వ్యక్తి నేను హైదరాబాద్ కు చెందిన ఫుడ్ అధికారిని అని నేరుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొందరు వసతి గృహాల వార్డెన్ లకు, హెచ్ఎంలకు, ఏటీడీఓ స్తాయి ఇలాంటి అధికారులకు సైతం ఫోన్లు చేసి డబ్బులు పంపాలి లేకపోతే సస్పెండ్ అవుతారని బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటన చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామం ఎస్టీ బాలుర వసతి గృహాల వార్డెన్ రాములకు విజయ్ కుమార్ సార్ ఫుడ్ అనే వ్యక్తి 7013812731 నెంబర్ నుండి ఫోన్ చేసి డబ్బులు వేయాలని బెదిరించిన నేపథ్యాన్ని ఆయన దిశకు ఫోన్ ద్వారా శనివారం సాయంత్రం వివరించారు.

వార్డెన్ రాములు మాటల్లో..

పైన తెలిపిన విజయ్ కుమార్ సార్ ఫుడ్ అనే వ్యక్తి హలో రాములు వార్డెను మీరేనా నీవు జీసీసీ నుండి నాణ్యతలేని సరుకులను కొనుగోలు చేసి విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నావని నీ పైన ఫిర్యాదు చేశారని, నేను మీ డీటీడీఓ స్థాయి అధికారిని కాదు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారిని మాటలు కలుపుతూ నా కుటుంబ నేపథ్యాన్ని అన్ని విషయాలు ఆరా తీసి ఈ వయసులో మీరు సస్పెండ్ అయితే మీకు చెడ్డ పేరు వస్తుంది కదా అంటూ తక్షణమే డబ్బులు పంపించాలని లేకపోతే సస్పెండ్ అవుతావని బెదిరింపు చేశాడన్నారు. ఈ క్రమంలో కాస్త బిత్తర పోయిన నేను ప్రస్తుతం నేను ఎస్ఎల్బీసీ వద్ద ఉన్నాను నా దగ్గర డబ్బులు లేవు అచ్చంపేటకు వచ్చిన తర్వాత డబ్బులు పంపిస్తాను 8 వేలే ఉన్నాయని.. చెప్పడంతో ఎంత ఉంటే అంత తక్షణమే పంపు అన్నాడని వివరించారు.

నా దగ్గర ఉన్న ఆ డబ్బులను ఫోన్ పే చేసే ప్రయత్నం చేసినప్పటికీ డబ్బులు వెళ్లడం లేదని ఆ విజయ్ కుమార్ అనే వ్యక్తికి సమాధానం చెప్పడంతో నీ ఇష్టం ఇబ్బంది పడతావని ఫోను పెట్టేసాడని వార్డన్ రాములు వివరించారు. అలాగే బల్మూరు మండలం చంచి గూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శంకర్ కూడా ఫోన్ చేసి లక్షల్లో డబ్బులు పంపాలని ఫోన్ చేయగా, అలాగే మహబూబ్నగర్ జిల్లా ఏటీడీవో అధికారిని యాదమ్మకు కూడా ఆ వ్యక్తి ఫోన్ చేసి ఐదు లక్షల రూపాయలు పంపాలని డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డట్లు రాములు దిశకు వివరించారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఎంత మందికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయో.. ఎంతమంది మోసపోయారు పోలీసులు దృష్టి కేంద్రీకరించాలని అధికారులు కోరుతున్నారు.

అమ్రాబాద్ పోలీసులకు తెలిపే ప్రయత్నం చేసిన..

వార్డెన్ రాములుకు శనివారం విజయ్ కుమార్ అనే వ్యక్తి పై నెంబర్ ద్వారా మధ్యాహ్నం 1 : 33 గంటల నుండి సాయంత్రం 4 : 5 గంటల వరకు పదేపదే ఫోన్లు చేసి బెదిరిస్తున్న సందర్భంలో అతని ఫోన్ కాల్ ను కాన్ఫరెన్స్ లో పెడుతూ అమ్రాబాద్ పోలీసులకు తెలిపే ప్రయత్నం ఎంత చేసినా కూడా వారు అందుబాటులోకి రాలేదని వార్డెన్ రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తుల పైన పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటే మరి కొంతమంది అతని భార్యను పడకుండా కాపాడేవారు అవుతారని చెప్పవచ్చు.

Next Story