ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగండి : మేడ్చల్ కలెక్టర్

by Aamani |
ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగండి : మేడ్చల్ కలెక్టర్
X

దిశ,మేడ్చల్ బ్యూరో : ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు. ప్రజావాణిలోనే కాకుండా ఎప్పుడైన అర్జీలు ఇవ్వడానికి వచ్చే దరఖాస్తుదారులను స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలెక్టర్ 99 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కలెక్టరేట్ ప్రజావాణిలోనే కాకుండా స్టేట్ ప్రజా భవన్ లో నిర్వహించిన దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు.

జిల్లా అధికారులు జాప్యం లేకుండా సమస్యలను పరిష్కరించి దరఖాస్తుదారునికి సమాచారం తెలియ పరచాలన్నారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed