- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ విష రాజకీయాలు ప్రజలకు తెలుసు: ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం గురుకులాలకు సొంత భవనాలను ఎందుకు కట్టలేకపోయిందని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఆఫీసుల మీద ఉన్న శ్రద్ధ విద్యార్ధుల భవిష్యత్ మీద లేదా? అంటూ ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేద విద్యార్ధులు చదువుకునే గురుకుల పాఠశాలలను ఎందుకు మెరుగ్గా తీర్చిదిద్దలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల సంఖ్యలు పెంచుకుంటే సరిపోదని, అందులో ఏ మేరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందనేది? ముఖ్యమని వివరించారు. కేవలం అంకెలు పెంచుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, కానీ విద్యార్ధులకు మెరుగైన వైద్యం కోసం వసతులు అందించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి అన్ని జిల్లాల్లో వందల కోట్లతో ఖరీదైన సొంత భవనాలు కట్టుకున్నారని, కానీ గురుకుల పాఠశాలలు కట్టేందుకు నిధులు సరిపోలేదా? అని వివరించారు. గురుకుల పాఠశాలలకు ఏళ్ల నుంచి బకాయిలు ఉన్నాయని, కేవలం తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కాదని వెల్లడించారు. త్వరలోనే నిధులు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్ని గురుకులాల పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నారని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కు సిగ్గులేదని విమర్శించారు.