PC Ghosh: ఆ డిజైన్లు, డ్రాయింగ్ లు రూపొందిచిందెవరు? ఇంజినీర్లకు పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం

by Prasad Jukanti |   ( Updated:2024-09-24 09:54:19.0  )
PC Ghosh: ఆ డిజైన్లు, డ్రాయింగ్ లు రూపొందిచిందెవరు? ఇంజినీర్లకు పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతున్నది. మంగళవారం విచారణకు పలువురు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని కమిషన్ పలు ప్రశ్నలు సంధించింది. డిజైన్లు, డ్రాయింగ్ లు ఎవరు తయారు చేశారని పీసీ ఘోష్ ప్రశ్నించగా వ్యాప్కోస్ సంస్థ తయారు చేసందని ఇంజినీర్లు సమాధాం ఇచ్చారు. వాటిని సీడీఓ సీఈ అనుమతితో అమలు చేసినట్లు వివరించారు. అలాగే ఉన్నతాధికారులకు తెలియకుండానే ఈఈ తిరుపతిరావు ఏెజన్సీలకు రూ. 1,600 కోట్ల బ్యాంకు గ్యారెంటలు ఇచ్చినట్లు ఇంజినీర్లు తెలిపారు. ఈఎన్సీ కార్యాయంలో జరిగిన సమావేశం మినిట్స్ అనుసరించకుండానే వీటిని విడుదల చేసినట్లు వారు వివరించారు. అయితే బ్యారేజీల డ్యామేజ్ కు అనుకున్నదానికంటే ఎక్కువ వరద రావడం వల్లే సీసీ బ్లా్క లు దెబ్బతిన్నట్లు వివరించారు. 2022 జులైలో వచ్చిన భారీ వరదల వల్ల సీసీ బ్లాక్ లు పాడైనట్లు వివరించారు. ఈ డ్యామేజీ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాశామని కమిషన్ కు వివరించారు. నిర్మాణానికి ముందు సైట్లలో ఎన్ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగినట్లు ఇంజినీర్లు వివరించారు.

కాగా ఈ నెల 20వ తేదీన నుంచి మరో దఫా ఓపెన్ కోర్టు విచారణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రారంభించింది. ఇప్పటికే పలువురు ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఈఏన్సీలు, మాజీ ఈఎన్సీలు, ప్రభఉత్వ కార్యదర్శులు, మాజీ కార్యదర్శులతో కమిషన్ సమావేశమైంది. వారి నుంచి అఫిడవిట్ల రూపంలో ఆధారాలు సేకరించింది. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి మరికొంత మంది ఇంజినీర్లు, అధికారులను తాజాగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది. తమ పరిశీలనలో ఇప్పటికే పలు లోపాలను గుర్తించిన కమిషన్ ఆ మేరకు వాటికి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించే పనిలో బిజీ బిజీగా ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed