జనసేన అభ్యర్థులకు బీ ఫామ్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో తొలిసారి పోటీపై కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-11-08 14:57:44.0  )
జనసేన అభ్యర్థులకు బీ ఫామ్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో తొలిసారి పోటీపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ తొలిసారిగా ప్రత్యక్షంగా తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతోంది. తెలంగాణలో బీజేపీతో కలిసి ఈ నెల చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లొ పోటీకి జనసేన రెడీ అయ్యింది. పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ 8 సీట్లు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎనిమిది మంది జనసేన పార్టీ అభ్యర్థులకు పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ బీఫామ్‌లు అందించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు మరో 48 గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఇవాళ హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ అభ్యర్థులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బీఫామ్‌లు ఇచ్చారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి సాధనకు జనసేన కట్టుబడి ఉందని తెలిపారు. హోమ్ రూల్ పాటించాలనే ఆలోచనతోనే దశాబ్ధ కాలంగా తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. తొలిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నామని తెలిపారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నేరవేరాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కోరారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన పార్టీ.. తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగి తెలంగాణలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక, పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు కేటాయించిన 8 సీట్లు ఇవే.

8 సీట్లు

ఖమ్మం- మిర్యాల రామకృష్ణ

కొత్తగూడెం- లక్కినేని సురేందర్‌రావు

అశ్వారావుపేట(ఎస్టీ)- ముయబోయిన ఉమాదేవి

కూకట్‌పల్లి- ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌

కోదాడ- మేకల సతీష్‌రెడ్డి

తాండూరు- నేమూరి శంకర్‌గౌడ్‌

వైరా(ఎస్టీ)- డా.తేజావత్‌ సంపత్‌ నాయక్‌

నాగర్‌ కర్నూల్‌- వంగల లక్ష్మణ్ గౌడ్‌

Advertisement

Next Story

Most Viewed