డిప్యూటీ CMగా పవన్ కల్యాణ్.. యోగి ఆదిత్యనాథ్ హార్ట్ టచింగ్ ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-14 12:48:32.0  )
డిప్యూటీ CMగా పవన్ కల్యాణ్.. యోగి ఆదిత్యనాథ్ హార్ట్ టచింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ-జనసేన-బీజేపీ సర్కారులో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నేడు (శుక్రవారం) శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. జనసేన చీఫ్, కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి గేమ్ ఛేంజర్‌గా మారిన పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి రావడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్ కు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విషింగ్ యూ ఏ సక్సెస్‌ఫుల్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ టెన్యూర్ అహెడ్ అని యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఇక, తమ అభిమాన నేతకు యూపీ సీఎం యోగి విషెస్ తెలపడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Advertisement

Next Story