High Court: వారిపై చర్యలు తీసుకోండి.. పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి

by Gantepaka Srikanth |
High Court: వారిపై చర్యలు తీసుకోండి.. పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద రెడ్డి(Patnam Narender Reddy) భార్య శృతి హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త నరేందర్‌ను అరెస్ట్ చేశారని పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు లగచర్ల(Lagcherla)లో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి కీలక కుట్రదారుడని రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు చెప్పారు. ఏ-2గా ఉన్న సురేశ్‌, ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించారని తెలిపారు. సురేశ్‌తో దాదాపు 89 సార్లు ఫోన్‌కాల్స్‌ మాట్లాడారంటే కుట్రలో నరేందర్‌రెడ్డి పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పిటిషనర్‌ ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్‌ సహా ఇతర అధికారులను దాడికి తెగబడ్డారని తెలిపారు.

Advertisement

Next Story