పఠాన్ చెరు ఎమ్మెల్యే కారుతో యువకుడు హల్ చల్..!

by Kalyani |
పఠాన్ చెరు ఎమ్మెల్యే కారుతో యువకుడు హల్ చల్..!
X

దిశ, వికారాబాద్: పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్టిక్కర్ గల వాహనంలో తప్పతాగిన యువకుడు హల్ చల్ చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్ బస్టాండ్ రోడ్డులో రోడ్డుకు అడ్డంగా కార్ నిలిపి ఓ యువకుడు కారులోనే నిద్రపోయాడు.

రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఎంతలేపిన ఆ యువకుడు నిద్ర లేవకపోవడంతో ట్రాఫిక్ జాం కాగా, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పొలీసులు రంగ ప్రవేశం చేయగా, ఆ కారుకు పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. కారులో యువకుడి డ్రైవర్ సీటు పక్కన మద్యం బాటిల్ కూడా లభ్యమయింది. ఈ సంఘటన వికారాబాద్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Next Story