- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Social Media : సోషల్ మీడియా కోఆర్డీనేటర్లకు బంపర్ ఆఫర్
దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా కోఆర్డీనేటర్ల(Social Media Coordinators) కు రాష్ట్ర ప్రభుత్వం(Congress govt) బంపర్ ఆఫర్( Bumper Offer) అందించబోతుంది. తెలంగాణలోని దేవాలయ కమిటీల్లో, ట్రస్టు బోర్డుల్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్ లను నియమించాలని కోరుతూ పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్(PCC chief Bomma Mahesh Kumar Goud) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కు లేఖ(letter)రాశారు. ఈ లేఖ పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే సోషల్ మీడియా కోఆర్డీనేటర్లకు కూడా పార్టీ నాయకులకు మాదిరిగానే నామినేటెడ్ పదవుల భాగ్యం దక్కనుంది. ప్రస్తుత రాజకీయాల్లో, ఎన్నికల్లో సమరంలో పొలిటికల్ పార్టీలకు సోషల్ మీడియా వింగ్ లు బలమైన వారియర్ గా పనిచేస్తున్నాయి.
నిత్యం ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ, సొంత పార్టీ విజయాలకు బాకా ఊదుతూ ప్రజల దృష్టిని ఆకర్షించడంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న పని పార్టీల, ప్రభుత్వాల మనుగడకు కీలకంగా తయారైంది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా బలమైన సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి, కాంగ్రెస్ గెలుపుకు సోషల్ మీడియా కారణమని బీఆర్ఎస్ అగ్రనేతలు బహిరంగంగా వాపోవడం విదితమే. ఈ బలహీనతను అధిగమించేందుకు ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బలోపేతంపై ఫోకస్ పెట్టి అ దిశగా ముందడుగు వేసింది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం బలమైన సోషల్ మీడియా వింగ్ ను నడిపిస్తోంది. టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో వారం క్రితమే కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి శిక్షణ తరగతులు సైతం నిర్వహించారు. ఇక బీజేపీ ముందునుంచి కూడా సోషల్ మీడియాలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్ట్రాంగ్ గా కొనసాగుతోంది.