పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు : BRS సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-31 04:04:21.0  )
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు : BRS సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలు రాష్ట్ర పతి ప్రసంగం అనంతరం ప్రారంభం కానున్నాయి. గతేడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగించనున్నారు. కాగా బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. కేంద్రం అన్ని అంశాల్లో విఫలమైనందున రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించనున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలు పట్టించుకోనందుకు నిరసనగా బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read...

టీ సర్కార్‌కు చుక్కలు చూపించిన గవర్నర్ పవర్!

Advertisement

Next Story