రైతుబంధు నిలిపివేతపై ఓవైసీ స్పందన

by Mahesh |   ( Updated:2023-11-28 14:40:37.0  )
రైతుబంధు నిలిపివేతపై ఓవైసీ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య విమర్శలు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాజకీయాలు మొత్తం రైతుబంధు చుట్టూ తిరుగుతున్నాయి. రైతు బంధు సాయం విడుదల చేయడం కోసం ఈసీ రెండు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పలు కారణాల వల్ల ఈ రోజు ఈసీ అధికారులు రైతు బంధు సాయం పంపిణీకి అనుమతిచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. దీనిపై AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

ఓవైసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది, ఇది కొనసాగుతున్న పథకం, సంవత్సరాలుగా అమలులో ఉంది. కొనసాగుతున్న పథకం పై ఏ పార్టీకి అభ్యంతరం లేదు. ?ఇది కొత్త పథకం అయితే మనకు అర్థమయ్యేది. కానీ ఇది కొత్త పథకం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆకస్మిక అభ్యంతరం రైతులకు ప్రయోజనం చేకూర్చకూడదని స్పష్టంగా సూచిస్తుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed