ఫేక్ సర్క్యూలేషన్ ఇష్యూలో కీలక పరిణాం.. మన్నె క్రిశాంక్ కు పోలీస్ కస్టడీ

by Prasad Jukanti |   ( Updated:2024-05-04 10:24:43.0  )
ఫేక్ సర్క్యూలేషన్ ఇష్యూలో కీలక పరిణాం.. మన్నె క్రిశాంక్ కు పోలీస్ కస్టడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన క్రిశాంక్ ను ఒక రోజు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో క్రిశాంక్ ను ఓయూ పోలీసులు రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం క్రిశాంక్ చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే క్రిశాంక్ భద్రతపై ఆయన భార్య సర్వే సుహాసిని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు మొత్తం బహిర్గతంగా ఉందని అలాంటప్పుడు పోలీస్ కస్టడీ అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఈ కేసును ఎందుకు పక్కదో పట్టిస్తున్నారని ప్రశ్నించారు. సోమవారం బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతున్నదని అప్పటి వరకు ఎందుకు ఎదురు చూడటం లేదన్నారు. సెలవు దినమైన ఆదివారం కస్టడీకి పోలీసుల హడావుడి ఏంటి అని నిలదీశారు. సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఏముందని గతంలో మాదాపూర్ పోలీసులు ఒక కేసులో ఓ ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి దాన్ని కోర్టులో కూడా హాజరుపరచలేదన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెయిల్ అనేది నియమం అని జైలు నుంచి మినహాయింపు అని చెప్పారని కాని ఇది కేవలం కాంగ్రెస్ సోషల్ మీడియాకు మాత్రమ వర్తిస్తారా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story