OU JAC: అల్లు అర్జున్ అభిమానుల నుంచి ప్రాణహాని.. ఓయూ జేఏసీ నేతల ఫిర్యాదు

by Ramesh Goud |   ( Updated:2024-12-29 16:14:36.0  )
OU JAC: అల్లు అర్జున్ అభిమానుల నుంచి ప్రాణహాని.. ఓయూ జేఏసీ నేతల ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ అభిమానుల(Allu Arjun Fans) నుంచి తమకు ప్రాణహాని ఉందని ఓయూ జేఏసీ నేతలు(OU JAC Leaders) పోలీసులకు ఫిర్యాదు(Complaint) చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampade) ఘటనలో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిపై అల్లు అర్జున్(Allu Arjun) ను బహిరంగ క్షమాపణలు కోరాలని, లేదంటే చంపేస్తామని ఆయన అభిమానుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఫిర్యాదుతో పాటు సమర్పించారు. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు తమ ఫోన్ నంబర్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారని, దీంతో అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో రోజూ వందల కొద్దీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అల్లు అర్జున్ అభిమానుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, బెదిరింపు కాల్స్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read More...

Pushpa 2 : పుష్ప 2 షో తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్ వైరల్


Advertisement

Next Story

Most Viewed