Employee Unions: ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఓడీ సౌకర్యం.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

by Ramesh N |
Employee Unions: ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఓడీ సౌకర్యం.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వివిధ ఉద్యోగ సంఘాల (employee unions) ప్రతినిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీస్ వెల్ఫేర్) డిపార్ట్‌మెంట్ జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ‘అదర్ డ్యూటీ’ (ఓడీ) (Other duty) సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓడీ పొందిన సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక సెలవులు మంజూరవుతాయి. ఈ క్రమంలోనే 8 సంఘాలకు ఓడీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సెంట్రల్ హైద్రాబాద్(టీఎన్‌టీఓ), తెలంగాణ క్లాస్ 4 ఎంప్లాయిస్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్), స్టేట్ టీచర్స్ యూనియన్ ఆఫ్ తెలంగాణ స్టేట్(ఎస్‌టీయూటీఎస్), తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్), ప్రొగ్రెసీవ్ రికగ్నైస్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్ (పీఆర్‌టీయూటీఎస్), తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఈఎస్ఏ) సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఓడీ సౌకర్యం కల్పించింది.

Next Story