- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రణరంగంగా మారిన ఓరుగల్లు.. తీవ్ర ఉద్రిక్తత
దిశ, హన్మకొండ టౌన్: హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ముట్టడికి బీజేపీ యత్నించడంతో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. హనుమకొండలోని బీఆరెస్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు జిల్లా ధర్మారం అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరంగల్ పట్టణ సమస్యలు పరిష్కరించడంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొంటూ బీజేపీ నేతలు బీఆర్ఎస్ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ గానే మోహరించారు.
బీజేపీ నేతలు రాకను తెలుసుకున్న బీఆరెస్ నేతలు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. రెండు పార్టీల నేతలు కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. రెండు పార్టీల నేతల తలలకు, కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. బీజేపీ అధికారప్రతినిధి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గాయపడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు