'ధరణిపై ప్రతిపక్షాలది రాద్ధాంతమే'

by Sathputhe Rajesh |
ధరణిపై ప్రతిపక్షాలది రాద్ధాంతమే
X

దిశ, హుజూరాబాద్ : ధరణి పోర్టర్‌పై రాజకీయ రాద్ధాంతం తప్ప చెప్పుకో దగ్గ సమస్యలేమీ లేవని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా దర్భార్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 4, 5, 19, 20 వార్డులకు సంబంధించిన సమావేశం రాంగోపాల్ రైస్ మిల్ చౌరస్తాలో శనివారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకే వీధుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు.

24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేస్తున్నారన్నారు. పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, కౌన్సిలర్‌లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యం రాజు, గనిశెట్టి ఉమా మహేశ్వర్, ప్రతాప మంజుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed