- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా బీఆర్ఎస్ మాత్రమే అడ్డుకోగలదు: మాజీ మంత్రి కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఓడించలేదని.. తమని తామే ఓడించుకున్నామని.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అన్నారు. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలను అడ్డుకోవాలంటే.. బీఆర్ఎస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించాలని అన్నారు. దీంతో పాటుగా.. బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా అడ్డుకోగలుతామని అన్నారు. అలాగే.. డీలిమిటేషన్ లో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని.. 12 స్థానాల్లో గెలిపిస్తే.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకొగలగుతామని కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అన్నారు.-
Read More...