- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం: మరోసారి తెరమీదకు MLC కవిత పేరు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరమీదకు వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించింది. కవిత వాడిన మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని సమీర్ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కవితతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తం గౌతమ్, అరుణ్ చంద్ర పిళ్లై, అభిషేక్ రావు పేర్లను ఈడీ ఛార్జ్‌షీటులో ప్రస్తావించింది. సమీర్ కంపెనీల్లో కవితకు 35 శాతం వాటా వుందని తెలిపింది. అలాగే శరత్ చంద్రారెడ్డి చేతుల్లో వున్న ఐదు రిటైల్ జోన్లను అభిషేక్ రావు నడిపిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో సమీర్ మహేంద్రను మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబులు కలిసినట్లు ఈడీ తెలిపింది. కాగా.. ఇటీవలే కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన కేసులో డిసెంబర్ 11న సీబీఐ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.