- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోసారి మంత్రి ఉత్తమ్‌పై బీజేఎల్పీ నేత ఏలేటి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మూడురోజుల నుంచి సివిల్ సప్లయ్ శాఖలో జరుగుతున్న అవినీతిపై మంత్రి సమాధానం చెప్పకపోగా దాటవేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో తాను లేనని మంత్రి చెప్పారని.. వచ్చాక సమాధానం చెబుతానని ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదని ఉత్తమ్‌పై మండిపడ్డారు.
కమిషనర్‌తో ప్రెస్ మీట్ పెట్టించి ఊరుకున్నారని తెలిపారు. ఎందుకు తప్పించుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా తాను బయటపెట్టానని.. అయినా తనపై కేసు పెట్టించారని సీరియస్ అయ్యారు. కొందరు నేతలతో ప్రెస్ మీట్ పెట్టి నాపై విమర్శలు చేయించారని పేర్కొన్నారు. అందుకే ఆ అవినీతిపై సీఎంకు బహిరంగ లేఖ రాస్తున్నా అన్నారు. 18 ప్రశ్నలతో కూడిన లేఖ రాశా.. వాటికి మంత్రి సమాధానం చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. సరైన టైంలో మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
దానివల్ల శాఖ ఎంత నష్టాల్లో ఉంది.. దానికి ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లిస్తోందని క్వశ్చన్ చేశారు. మిల్లర్ల నుంచి రూ.22 వేల కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయట్లేదని ఫైర్ అయ్యారు. ఇందుకు గల లోపాయికారి ఒప్పందం ఏంటి అన్నారు. జనవరి 25వ తేదీన జీవో రిలీజ్ చేసి, అదే రోజు కమిటీబ వేసి, అదే రోజు గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి, అదే రోజు టెండర్ ప్రాసెస్ చేశారని ఆరోపించారు. ఒక్కరోజులోనే అంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది. దీని వెనుకున్న మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. మే 15 వరకు సీఎంఆర్ రైస్ ను కొంటామని కేంద్రం చెప్పినా టెండర్ ఎందుకు పెట్టారు. టెండర్‌లో బయట వారికి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
అలాంటప్పుడు కేంద్రానికి లేఖ ఎందుకు రాశారు? కేంద్రంపై నిందలు మోపేందుకా అని సీరియస్ అయ్యారు. టెండర్‌లో రేటు ఫైనల్ చేశాక జల సౌధలో బిడ్డర్లు, కాంట్రాక్టర్లను పిలిపించి మంత్రి, కమిషనర్ చేపట్టిన చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. చీకటి ఒప్పందంలో రూ.100 స్టాంప్ పేపర్‌పై బిడ్ ఇచ్చిన వారికి, రైస్ మిల్లర్లకు మధ్య ఒక ఎంవోయూను రాయించుకున్నది వాస్తవం కాదా? వారి సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా? అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన గడువు కేవలం 90 రోజులు.. వారు ఎలాగైనా తమకు ఎక్స్ టెన్షన్ వస్తుందని ఎంవోయూలో రాయించుకున్నారని ఏలేటి ఆరోపించారు. మే 23తో 90 రోజుల గడువు దాటింది.. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.
వారి బిడ్ ను రద్దుచేసి వేరే వారికి ఇస్తారా? లేక వారికే ఎక్స్ టెన్షన్ ఇస్తారా? కండీషన్ లో 90 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పి వారిపై కనికరం ఎందుకు చూపుతున్నారు? ఎందుకు ఎక్స్ టెన్షన్ చేయాలని చూస్తున్నారో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగ లేఖను ముఖ్యమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా కాపీని అందజేస్తా అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే సీఎంకు చిత్తశుద్ధి ఉంటే నిజనిర్ధారణ కమిటీ వేయాలి లేదా హైకోర్టు జడ్జితో లేదా సిట్టింగ్ జడ్జితో లేదా రిటైర్డ్ జడ్జితో కానీ కమిటీ వేయండన్నారు. మంత్రిపై ఆరోపణలు చేస్తే ఆయన సమాధానం చెప్పాలి.. నిజం కాదంటే ఇదంతా నిజం కాదని చెప్పమనండన్నారు. సీఎంకు బహిరంగ లేఖతో పాటు ఆధారాల కాపీని కూడా జతపరుస్తున్నా అన్నారు.