Konda Surekha : 19న హన్మకొండలో కాంగ్రెస్ ‘ప్రజాపాలన విజయోత్సవ సభ : మంత్రి కొండా సురేఖ

by Y. Venkata Narasimha Reddy |
Konda Surekha : 19న హన్మకొండలో కాంగ్రెస్ ‘ప్రజాపాలన విజయోత్సవ సభ : మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 19న హన్మకొండ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కాలేజీలో ‘ప్రజాపాలన విజయోత్సవ సభ’('Prajapalana Vijayotsava Sabha') నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha)తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవ సభ, మహిళా సభలో తమ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. అలాగే అదే రోజు ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి కొత్తగా చేపట్టనున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఇందిరా శక్తి భవన్, మమూనూర్ ఎయిర్ పోర్టు వంటి పథకాల పనులను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజాసంక్షేమానికి పునరంకితమవుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు వసతి, 500లకే సిలిండర్, 200యూనిట్ల గృహ విద్యుత్తు, విద్యార్థులకు హాస్టల్ చార్జీల పెంపు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కుల గణనతో బలహీన వర్గాల అభివృద్ధికి సర్వే చేపట్టిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed