ఆగష్టు 31 తర్వాత తెలంగాణలో గంజాయి కనిపించదు.. కమలాసన్ రెడ్డి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
ఆగష్టు 31 తర్వాత తెలంగాణలో గంజాయి కనిపించదు.. కమలాసన్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గంజాయి నియంత్రణపై హన్మకొండ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, సీపీ అంబర్ కిశోర్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగష్టు 31 తర్వాత తెలంగాణలో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని ప్రకటించారు. గుడుంబా రహిత రాష్ట్రంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో బెల్ట్ షాపుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతేగాకుండా.. విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో గుట్టుగా సాగుతున్న గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై ఎప్పటికప్పుడు పోలీసులు పంజా విసురుతున్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణాగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆదేశాలను అధికారుల సాయంతో పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed