వారం రోజులు ఎంఎంటీఎస్ రైళ్ల బంద్.. పలు స్పెషల్ రైళ్లు కుడా

by Javid Pasha |   ( Updated:2023-07-02 15:30:08.0  )
MMTS in hyderabad
X

దిశ , తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో జరుగుతున్న ట్రాక్ మెయిటెనెన్స్ పనుల కారణంగా నేటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు వివిధ రూట్లలో నడిచే 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ ప్రయాణికులు సహృదయంతో తమకు సహకరించాలని అధికారులు కోరారు.

వివిధ మార్గాలలో రద్దైన స్పెషల్ రైళ్లు

కాజీపేట– డోర్నకల్, విజయవాడ – డోర్నకల్, భద్రాచలం– విజయవాడ, విజయవాడ– భద్రాచలం, సికింద్రాబాద్– వికారాబాద్, వికారాబాద్– కాచిగూడ, సికింద్రాబాద్– వరంగల్, వరంగల్– హైదరాబాద్, సిర్పూర్ టౌన్ – కరీంనగర్, కరీంనగర్ – నిజాబాబాద్, కాజీపేట– సిర్పూర్ టౌన్, బల్లార్షా– కాజీపేట, భద్రాచలం – బల్లార్షా, సిర్పూర్ టౌన్ – భద్రాచలం, కాజీపేట – బల్లార్షా, కాచిగూడ – నిజామాబాద్, నిజామాబాద్– నాందేడ్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. , కాచిగూడ - మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ ఉందానగర్ వరకు , -నాందేడ్– నిజామాబాద్​-పండర్​పూర్ ఎక్స్​ప్రెస్ ను ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తుందన్నారు.

22 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

నేటి నుండి ఈ నెల 9 వరకు పలు మార్గాలలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సి హెచ్ రాకేష్ తెలిపారు లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి - ఉందానగర్ 3, లింగంపల్లి - ఫలక్ నుమా 2, ఉందానగర్ - లింగంపల్లి 4, ఫలక్ నుమా - లింగంపల్లి 2, రామచంద్రాపురం - ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story