- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేఘా ఇంజినీరింగ్‌పై సీబీఐ కేసు.. ఎందుకంటే..
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఐఎస్‌పీ ప్రాజెక్టులోని రూ.315 కోట్ల ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌తో పాటు కేంద్ర ఉక్కు శాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఆఫీసర్లంతా కేంద్ర ఉక్కుశాఖ పరిధిలోని ఎన్‌ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంటుకు చెందినవారే. ఎన్‌ఎండీసీ నుంచి మేఘా ఇంజినీరింగ్‌కు ఓ కాంట్రాక్టుకు సంబంధించిన పేమెంట్ చేసే విషయంలో.. ఎన్ఎండీసీకి చెందిన 8 మంది అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు అధికారులు లంచం పుచ్చుకున్నారని సీబీఐకి ఫిర్యాదు అందింది. దీంతో కేసును నమోదు చేశారు. ఇటీవల బహిర్గతమైన ఎన్నికల బాండ్ల చిట్టా ప్రకారం.. మన దేశంలో రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలను అందించిన రెండో అతిపెద్ద సంస్థగా మేఘా నిలిచింది. ఈ కంపెనీ ఏకంగా రూ.966 కోట్లు విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలను అందించింది. ఈ కంపెనీ నుంచి అత్యధిక విరాళాలు బీజేపీ, బీఆర్ఎస్‌కే అందాయి.