Breaking News: ఎమ్మెల్సీ కవిత ఫోన్లు సీజ్.. ఇంటి బయటే లాయర్లను అడ్డుకున్న అధికారులు..!

by Satheesh |   ( Updated:2024-03-15 10:55:19.0  )
Breaking News: ఎమ్మెల్సీ కవిత ఫోన్లు సీజ్.. ఇంటి బయటే లాయర్లను అడ్డుకున్న అధికారులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ, ఐటీ అధికారుల బృందం హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఉన్న నిందితులతో కవిత లావాదేవీలు జరిపినట్లు ఆరోపిస్తున్న ఈడీ.. గతంలో రెండు సార్లు ఆమెకు నోటీసులు ఇచ్చి విచారించింది. తాజాగా కవిత ఇంట్లో జరుగుతోన్న ఈడీ, ఐటీ సోదాలు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించేనని సమాచారం. సోదాల సందర్భంగా దర్యాప్తు సంస్థల అధికారులు ఎమ్మెల్సీ కవిత ఫోన్లు అన్నింటినీ సీజ్ చేశారు.

కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, సిబ్బంది మొబైల్ ఫోన్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కవిత ఇంట్లో కేంద్ర దర్యాప్తు బృందాల సోదాల నేపథ్యంలో ఆమె తరుఫు న్యాయవాదులు సోదాలు జరుగుతోన్న ఇంటికి చేరుకున్నారు. చట్టపరమైన అంశాలపై స్టడీ చేసేందుకు వెళ్లగా.. అధికారులు కవిత లాయర్లను బయటే అడ్డుకున్నారు. సోదాల నేపథ్యంలో కవిత న్యాయవాదులను ఇంట్లోకి రాకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ఇక, కవిత ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు సోదాలు జరుపుతుండటం బీఆర్ఎస్‌లో సంచలనంగా మారింది. ఎన్నికల ముంగిట కవిత ఇంట్లో సోదాలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎదుర్కొలేక బీజేపీ భయపడి ఈడీ, ఐటీలను ప్రయోగిస్తోందని మండిపడుతున్నారు.

Read More..

BREAKING: కవిత ఇంట్లో రైడ్స్.. హుటాహుటిన KCR నివాసానికి బయలుదేరిన హరీష్ రావు

Advertisement

Next Story