బీసీలకు లోన్ కేసీఆర్ ట్రాప్.. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్

by Javid Pasha |
బీసీలకు లోన్ కేసీఆర్ ట్రాప్.. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు లోన్లు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, ఇదంతా ఒక ట్రాప్ అని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వానికి బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. లోన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అందుకు కావాల్సిన ధృవీకరణ పత్రాలకే నెల సమయం పడుతుందని ఆయన చెప్పారు. అలాంటిది బీసీ లోన్ కోసం కేవలం 15 రోజుల వ్యవధి ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.

ఇది బీసీ సంక్షేమ స్కీమ్ కాదని, బీసీలను సంక్షోభంలో నెట్టే స్కీమ్ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు బీసీ సబ్ ప్లాన్ కింద 6 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వారికి లోన్ ఇస్తే వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేవారు కదా అని ఆయన ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గించిందన్నారు. బీసీలకు ఏం చేయాలనే క్లారిటీ ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శలు చేవారు. ఎలక్షన్స్ జిమ్మికుల కోసమే బీసీ లోన్ స్కీమ్ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed