తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. ఇక BJP గేమ్ స్టార్ట్: NVSS ప్రభాకర్

by Satheesh |   ( Updated:2023-02-13 12:11:56.0  )
తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. ఇక BJP గేమ్ స్టార్ట్: NVSS ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతమైందని, ఇక బీజేపీ ఆట మొదలైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ సహకరిస్తోందని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో బీఆర్ఎస్‌ని గెలిపించడానికి ఎంఐఎం పనిచేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, నేడు వాటిని తుంగలో తొక్కారని విమర్శలు చేశారు.

దళిత ముఖ్యమంత్రి హామీ పేరిట ఆ వర్గం మొత్తాన్ని మోసం చేసిన ఘనత కేసీఆర్‌ది అని ప్రభాకర్ ఎద్దేవాచేశారు. కేసీఆర్ ఇద్దరు దళిత ఎమ్మెల్యేలను ఉప ముఖ్యమంత్రులుగా చేశారని, దాంతో ఆ వర్గానికి పెద్దపీట వేసినట్లు నమ్మించి తిరిగి తొలగించారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ ఇద్దరు దళిత మాజీ ఉప ముఖ్యమంత్రులకు టికెట్ వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. మైనార్టీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత నేడు డమ్మీగా మారారని, కేవలం నామమాత్రంగా ఉన్నారన్నారు. బీజేపీ ఆట మొదలైందని, ఇక బీఆర్ఎస్ ఆట కట్టిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Advertisement

Next Story