ఉమ్మడి పౌరస్మృతి దేశ సమగ్రతకు గొడ్డలి పెట్టు.. ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్.వేణు గోపాల్

by Javid Pasha |
ఉమ్మడి పౌరస్మృతి దేశ సమగ్రతకు గొడ్డలి పెట్టు.. ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్.వేణు గోపాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి పౌరస్మృతి దేశ సమగ్రత, ఐకమత్యానికి గొడ్డలి పెట్టని 'వీక్షణం' సంపాదకులు ఎన్.వేణు గోపాల్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి భారతదేశంలో 565 సంస్థానాలు ఉన్నాయని, అనేక జాతులు, అనేక భాషలతో కూడిన సమాహరమైన ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఏ విధంగా సాధ్యమవుతుందని అయన ప్రశ్నించారు. అఖిల భారత మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం హైదెరాబాద్ లో ‘భిన్న సాంస్కృతుల సమాహర భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమా’ అనే అంశంపై సెమీనార్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఉమ్మడి పౌరస్మృతిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 22వ లా కమిషన్ ద్వారా ఉమ్మడి పౌరస్మృతిపై దేశ ప్రజల నుంచి అభిప్రాయాలను కేంద్రం కోరిందని, అయితే పౌరస్మృతికి సంబంధించిన ప్రతిపాదనలు మాత్రం గోప్యంగా ఉంచిందని వేణు గోపాల్ అన్నారు. మను ధర్మాన్ని ఆదివాసీ, గిరిజన, దళితుల నెత్తిన రద్దేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని విమర్శించారు.

ఉమ్మడి పౌరస్మృతితో ఎవ్వరికి లాభం ఉండదన్నారు. బీవీ విజయలక్ష్మి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేంద్రంలోని బిజెపి సర్కార్ ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. మను ధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. మణిపూర్ మానవత్యం మంటగలిపారని, బిజెపి మహిళ నేతలు కూడా మణిపూర్ విషయంలో స్పందించకపోవడం విచారకరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి పౌరస్మృతిని రానివ్వమన్నారు. బీజేపీ ప్రభుత్వం మధ్యయుగాల నాటి ఆచారాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని పశ్య పద్మ హెచ్చరించారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలంటే సమాజం మొత్తం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వం ఉండాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి, బీజేపీ ఓట్లు దండుకునేందుకు ఉమ్మడి పౌరస్మృతిని ఉపయోగించుకుంటుందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి హిందువులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలకు ఎవ్వరికీ మేలు చేయదని ఆమె తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed