న్యూడ్‌కాల్స్ కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-04 06:16:00.0  )
న్యూడ్‌కాల్స్ కేసు : వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ కూకట్‌పల్లిలో మహిళలకు న్యూడ్ కాల్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మహిళలను వేధిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు చంద్రశేఖర్ హెర్బా లైఫ్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. వెయిల్ లాస్ కోసం వచ్చిన మహిళల పేర్లు, ఫోన్ నెంబర్లు సేకరించి వాళ్లకు మాయ మాటలు చెప్పి ట్రాప్ చేసేందుకు యత్నించేవాడు. న్యూడ్ కాల్స్‌తో మహిళలకు వీడియోల రికార్డింగ్స్ కూడా పంపిస్తుండే వాడు. ఆ తర్వాత బ్లాక్ బెయిల్ చేస్తాడు. అలా ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రశేఖర్ గుట్టురట్టు అయింది.

గతంలోనూ ఓ మహిళను ట్రాప్ చేసిన కేసులో చంద్రశేఖర్ జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా మారకుండా మహిళలకు వేధింపులు కొనసాగిస్తూ వచ్చాడు. నిందితుడు చంద్రశేఖర్‌ను కూకట్‌పల్లి పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఒంటరి మహిళలనే చంద్రశేఖర్ టార్గెట్ చేశారని పోలీసులు తెలిపారు. అంతేకాదు వారితో పర్సనల్‌గా చాట్ చేస్తూ చనువుగా ఉండేవారని చెప్పారు. రాత్రి సమయాల్లో వారితో న్యూడ్ కాల్స్ మాటాడటం చేసే వారని వెల్లడించారు. అలా మహిళలను లొంగదీసుకునే ప్రయత్నాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. మహిళలకు న్యూడ్ కాల్స్ తో పాటు అసభ్యకర మెసెజ్ లు పెట్టేవాడని పోలీసులు తెలిపారు.

Read more:

కుక్క కరిస్తే యజమానికి కారాగార శిక్ష.. తీర్పు ఇచ్చిన కోర్టు

Advertisement

Next Story