- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే..!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ సంక్షేమ (ఎంజేపీటీబీసీడబ్ల్యూ), ఎస్సీ (టీఎస్‌డబ్ల్యూ) సంక్షేమ, ఎస్టీ (టీటీడబ్ల్యూ) సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష- ఆర్‌డీసీ సెట్-2024 నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీసీ సంక్షేమ గురుకుల సొసైటీలో 15 బాలుర కళాశాలలు, 15 మహిళా కళాశాలలు, ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీలో 26 మహిళా కళాశాలలు, ఎస్టీ సంక్షేమ గురుకుల సొసైటీలో 6 బాలుర కళాశాలలు, 15 మహిళా కళాశాలల్లోని సీట్లను భర్తీ చేయనున్నారు. 2024వ సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులుగా ప్రకటించారు.
డిగ్రీలో ప్రవేశం కొరకు ఆయా కళాశాలలో బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సులకు 40 సీట్లు చొప్పున కేటాయించారు. మెరిట్ విధానంలో సీటు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ గురుకుల కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్యా, భోజన వసతి అందిస్తారు. అలాగే యూనిఫామ్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ మొదలైన సదుపాయాలు అందించబడును. దాంతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యావకాశాలు అందుకునేలా విద్యార్థులను సంసిద్ధులుగా చేస్తారు. అలాగే ప్రాంగణ నియామక అవకాశాలు కల్పించడం జరుగుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని అధికారులు కోరారు. ఆయా కోర్సులలో చేరుటకు విద్యార్థులు ఆన్లైన్ లో tsrdccet.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 21 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. TGRDC CET 2024 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 28న జరగనుంది.