- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కాంలో నోటీసులు కేవలం సినిమా టైటిల్స్.. తప్పించుకోవడం భ్రమ
దిశ, తెలంగాణ బ్యూరో : లిక్కర్ స్కాంలో నోటీసులు రావడం కేవలం సినిమా టైటిల్స్ తో సమానమని మాజీ ఐఏఎస్, బీజేపీ నేత చంద్రవదన్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుజరాత్ ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణపై కూడా పడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రంలో పోలీసులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 37 మంది ఐఏఎస్ అధికారులు ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు చేశారు. తెలంగాణలో బ్యూరోక్రాట్స్ స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. ఇతర రాష్ట్రాలకు డిప్యూటేషన్ పై వెళ్లేందుకు మొగ్గుచూపుతున్న దుస్థితి తలెత్తిందని రాష్ట్ర సర్కార్ తీరుపై ఆగ్రహం వెళ్లగక్కారు. కేవలం ఒక పార్టీ చెబితే వినాల్సిన పరిస్థితి బ్యూరోక్రాట్లకు దాపురించిందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో వారి పరిస్థితి ఇంకెంత దీనంగా మారుతుందోనని పేర్కొన్నారు.
ఇక లిక్కర్ స్కాం ప్రాథమిక దశలో ఉందని, నోటీసులు కేవలం సినిమా టైటిల్స్ గా ఆయన పోల్చారు. సినిమా మొదలైతే కేసు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ మాజీ కమిషనర్‌గా తాను చెబుతున్నానని, ఈ కేసు ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నారు. కేసు నుంచి బయటకు రావచ్చు అని భావిస్తున్నారని, కానీ అదంతా భ్రమ అని మాజీ ఐఏఎస్ చంద్రవదన్ తెలిపారు.