తెలంగాణకు కాదు.. కవితకే అవమానం : భట్టి విక్రమార్క

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-09 08:26:21.0  )
తెలంగాణకు కాదు.. కవితకే అవమానం : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాంలో అవినీతి చేసిన వారు ఎంత పెద్దవారైన దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తాను గాంధేయ వాదినంటూ కేజ్రీవాల్ గొప్పలు చెప్పారని ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కాం కొన్ని ప్రభుత్వాలను అతలాకుతం చేస్తోందన్నారు. అవినీతిని చీపురుతో ఊడుస్తామని కేజ్రీవాల్ అన్నారని దేశంలో ఏ ప్రభుత్వం చేయనంతగా ఆప్ సర్కార్ లిక్కర్ స్కాంకు పాల్పడిందన్నారు.

అన్నా హజారే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేజ్రీవాల్ లిక్కర్ స్కాంలో పాల్గొనడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ భావోద్వేగాలను మళ్లీ కవిత రెచ్చగొడుతున్నారని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. విచారణను ఎదుర్కొవాల్సింది పోయి తెలంగాణకు అవమానం అంటున్నారని కవితపై మండి పడ్డారు. తెలంగాణకు అవమానం అనడాన్ని ఖండిస్తున్నామన్నారు. లిక్కర్ స్కాంలో పాల్గొనడం కవితకు అవమానం అన్నారు.

ఇవి కూడా చదవండి : టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లకు రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి

కవిత లేఖలను ఎందుకు పరిగణిస్తున్నారు?: కాంగ్రెస్ నేత బక్క జడ్సన్

Advertisement

Next Story