- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం ఎవరికీ లేదు : మంత్రి సీతక్క
దిశ, బెజ్జూర్ : దేవుళ్ల పేరుతో బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, వాళ్లు దేశభక్తులు మేము దేశద్రోహులమా అని రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొనే ప్రసంగించారు. బీజేపీ నాయకులు జైశ్రీరామ్ అంటూ దేవులను బయటకు తెస్తూ రాజకీయం చేస్తున్నారని, పదేళ్ల కేంద్రం ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీం లను కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. అదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాణహిత చేవెళ్ల, కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు పనులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ ప్రభుత్వం పేదలపై పన్నులు వేస్తూ దుర్మార్గ పరిపాలన చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం టాక్స్ టెర్రరిజం చేస్తుందన్నారు. ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే నైజం రేవంత్ రెడ్డికి ఉందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం ఎవరికీ ఉందన్నారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచుతామన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకు పదవి మీద తప్ప ప్రజల మీద ధ్యాస లేదన్నారు. కాంగ్రెస్ నాయకులను హేళన చేయడం తప్ప ఆయన చేసింది ఏం లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు.