- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heavy Vehicles: ఉదయం 7 గంటలకు సీటీలోకి భారీ వాహనాలు నో ఎంట్రీ.. నగర పోలీస్ కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి భారీ వాహనాలు యదేచ్చగా తిరుగుతున్నాయని నగర పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరగడం, ప్రమాదాలు జరగడం వంటివి పోలీసులు గమనించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, ప్రమాదాల నివారణకు నగరంలోకి పలు వాహనాల రాకపోకలను రద్దు చేస్తూ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు.
భారీ వాహనాలు, వ్యాన్లు, నేషనల్ పర్మిట్ లారీలు, లోకల్ లారీలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేటు బస్సులపై ఆంక్షలు విధించారు. లోకల్ లారీలు, భారీ వాహనాలకు ఉదయం 7: 00 గంటల తర్వాత నగరంలోకి ఎంట్రీ లేదని నిబంధనలు జారీ చేశారు. ప్రైవేటు బస్సులకు ఉదయం 8: 00 గంటల తర్వాత సిటీలోకి అనుమతి లేదని ప్రకటించారు. నగరంలోకి వెళ్లాలంటే రాత్రి 12: 00 గంటల తర్వాతే ప్రవేశించాలని, నగరంలోకి భారీ హవానాలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి 11: 00 గంటల నుంచి ఉదయం 7: 00 గంటల వరకు సామాగ్రిని తరలించే స్థానిక వాహనాలను అనుమతిస్తామని పేర్కొన్నారు. ఉదయం 8: 00 గంటల నుంచి రాత్రి 10: 00 గంటల వరకు ప్రైవేటు బస్సులను నగరంలోకి అనుమతి ఉండదని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని 94 రూట్లలో ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. కేటాయించిన సమయానికి మించి భారీ వాహనాలు రోడ్లమీద తిరుగుతున్నాయని దాని పరిణామాలు రెండు రోజుల క్రితం హబ్సిగూడలో లారీ ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతికి కారణమని పోలీసులు తెలిపారు.