- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ జాతీయ మేనిఫెస్టో కమిటీలో ఏపీ, తెలంగాణకు నో చాన్స్! వివక్ష?
దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మందితో కమిటీని శనివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్‌గా పీయూష్ గోయెల్‌ను నియమించారు. అయితే ఈ బీజేపీ జాతీయ మేనిఫెస్టో కమిటీ లో తెలుగు వారికి చోటు దక్కలేదు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో నేతలు లేకపోవడం గమనార్హం.
కమిటీలో బెర్త్ దక్కలేదు
జాతీయ మేనిఫెస్టో కమిటీలో తెలుగు వారిని పెట్టకపోవడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీలో నలుగురు నేతలు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నా కూడా ఆ నేతలకు చోటు దక్కకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం జాతీయ రాజకీయాల్లో బీజేపీ నేతలు కీలకంగా కూడా తెలుగు నేతలకు మేనిఫెస్టో కమిటీలో బెర్త్ దక్కలేదు.
సౌత్ నుంచి ముగ్గురు
మరోవైపు సౌత్ నుంచి ముగ్గురిని మాత్రమే జాతీయ కమిటీలోకి తీసుకున్నారు. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు, కర్నాటక నుంచి రాజీవ్ చంద్రశేఖర్, కేరళ నుంచి అనిల్ అంటోనీని తీసుకున్నారు. అయితే ఏపీ, తెలంగాణను కాదని పార్టీ బలంగా లేని తమిళనాడుకు కమిటీలో ప్రాధాన్యత ఇవ్వడం వెనుకున్న మతలబు ఏమిటని? బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకట స్వామి గతంలో పనిచేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read More..