మీ సేవలు ప్రజలకు ప్రభుత్వానికి వారదులు

by Naresh |
మీ సేవలు ప్రజలకు ప్రభుత్వానికి వారదులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో శనివారం మీసేవా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజీవగాంధీ ఆడిటోరియంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ ఆర్డీవో రాజేందర్ హాజరై మాట్లాడుతూ… మీ సేవలు ప్రజలకు ప్రభుత్వానికి వారదులని ప్రజలు ప్రభుత్వానికి సంభదించిన అనేక సేవలను మీసేవ ద్వారా పొందుతున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌లను సైతం మీసేవ కేంద్రాలకు అప్పచెప్పారని అన్నారు. ప్రజలకు మంచి సర్వీస్‌ను అందజేసి ప్రజల వద్ద మన్ననలు పొందాలన్నారు. ఈ సందర్భంగా మీసేవ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ… 2011 సంవత్సరంలో ప్రారంభమైన ఆఫ్టన్ కేంద్రాల నుంచి నిత్యం ఎన్నో సర్వీస్‌లను ప్రజలకు అందజేసినా కనీసం కమీషన్ నెల కు రూ. 2 నుంచి 3 వేలు కూడా మించడం లేదని వాపోయారు.

నెల వచ్చే సరికి రూమ్ రెంట్, కరెంట్ బిల్, నెట్ బిల్ మొత్తం కలిపి దాదాపు రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుండడంతో ఫోన్ రీఛార్జ్‌ను సైతం చేస్తూ ప్రైవేట్ ఆన్లైన్ సర్వీ సులపై ఆధారపడి నెట్టుకోస్తున్నానని నిర్వాహకుల సమస్య లను అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులకు తెలిపి కమిషన్ పెంచాలని కోరారు. కొందరు ప్రైవేట్ ఇంటర్ నెట్ సెంటర్, ఆన్లైన్ సెంటర్ వాళ్ళు చేసే తప్పిదాల వల్ల మీసేవ నిర్వాహకులకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. మీసేవ కేంద్రాలు ప్రభుత్వ అధికారుల ఆధీనంలో కొనసాగుతాయి కావున నిర్వాహకులకు తప్పులు చేయడానికి అవకాశం ఉండదని, ప్రైవేట్, నెట్ కేఫ్ వాళ్ళ తప్పిదాలు మీసేవలపై పడి నిందలు వస్తున్నాయని అన్నారు. ఈ సమ్మేళనంలో పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొని పలు సర్వీసులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యోహాన్, జిల్లా మీసేవ ఈడీఎం లు కార్తీక్, అర్జున్, సీఎస్‌ఈ డీఎం గౌతమ్ తహసీల్దార్‌లు అనిరుద్, నాగార్జున్, బాబూసింగ్, ఎంఎస్‌వో దాస్‌లు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక . . .

జిల్లా మీసేవ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులు చందుపట్ల శ్రీనివాస్, కార్యదర్శి సీతారి క్వీన్, ఉపాధ్యక్షులు గొనె విశ్వనాథం, కోశాధికారి సబ్బానీ దర్మానందం, సంయుక్త కార్యదర్శులు, చుక్కల రాజేష్, ఆర్గనైజేషన్ కార్యదర్శి పెద్దోళ్ల కిషోర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు, ఫసీ హైమద్, బండి రవి, మండల స్థాయి అధ్యక్షుడు మీసేవ, ఆధార్,, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story