ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పనిచేయాలి

by Sridhar Babu |
ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పనిచేయాలి
X

దిశ, కామారెడ్డి : రాబోయే వినాయక చవితి, నవరాత్రుల పండుగల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు జిల్లా ఎస్పీ సింధు శర్మ దిశా నిర్దేశం చేశారు. పెండింగ్ కేసులపై నెల వారి సమీక్ష సమావేశం తన కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ప్రతి గ్రామాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ తో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు. నేరాలు తగ్గేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.

తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో సమస్యాత్మక గ్రామాలను పోలీస్ అధికారులు సందర్శించాలని ట్రబుల్ మాంగర్స్, తరచుగా తగాదాలకు, నేరాలకు పాల్పడేవారి పై నిఘా ఉంచాలని, పీస్ కమిటీ మీటింగ్ లు ఏర్పాటు చేసి మండపాల నిర్వాహకులతో మాట్లాడాలన్నారు. జిల్లాలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల్లో హాట్ స్పాట్ లను ఏర్పాటు చేసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రైమ్ మ్యాపింగ్ తయారు చేసి అక్కడ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి సూచించారు. బాగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి, డీఎస్పీ లు నాగేశ్వరరావు, శ్రీనివాసులు, సత్యనారాయణ, మదన్ లాల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్ తో పాటు సీఐ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story