- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యో పాపం.. చిట్టి చేతులకు ఎంత కష్టం..
దిశ, కోటగిరి : బకెట్ నీళ్ల కోసం విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. ఈ దుస్థితి కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు పట్టింది. పుస్తకం పట్టుకోవాల్సిన చిట్టి చేతులు హాస్టల్లో నీళ్ల కొరత ఉండడంతో బకెట్లు మోస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా హాస్టల్ లో నీళ్లు రాకపోవడంతో స్నానానికి కూడా నీళ్లు లేకపోవడంతో చేసేదేమి లేక బకెట్ నీళ్ల కోసం ఆమడ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద నుంచి నీళ్లను మోస్తున్నారు.
అది చూసిన స్థానికులు అయ్యో పాపం అంటూ జాలిపడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పత్తాలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పై దిశ ప్రతినిధి ఎస్సీ హాస్టల్ వార్డెన్ ను చరవాణి ద్వారా వివరణ కోరగా మిషన్ భగీరథ నల్లాలు లీకేజ్ కారణంగా గత రెండు రోజుల నుంచి నీటి సమస్య ఏర్పడిందని, ఈ విషయం పై గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. 90 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్ లో బోరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.