- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదో తరగతి విద్యార్థులకు "సార్" సినిమా టికెట్లను అందించిన వైస్ ఎంపీపీ..
దిశ, మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని ఫరీద్ పేట్ ఉన్నతపాఠశాల పాల్వంచ ఆర్ఆర్ టాలెంట్ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్న దాదాపు 170 మంది విద్యార్థులకు సార్ సినిమా టికెట్లను, స్నాక్స్, వాటర్ బాటిళ్లను మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగారావు సూచన మేరకు హారిక మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి విద్యార్థులకు అందించారు. సార్ సినిమా ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల ఎంతో శ్రమతో వారి భవిష్యత్తును మెరుగుపరిచే విధంగా ఆ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
కొంతమంది మిత్రుల సహకారంతో సినిమాను పిల్లలకు చూయిస్తే విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలతో డీఈవో రాజు అనుమతితో విద్యార్థులకు సార్ సినిమా ప్రదర్శనకు తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎల్లయ్య, డీఎస్ఓ సిద్ధిరామిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, ఉపాధ్యాయులు కొండల్ రెడ్డి, చరణ్ సింగ్, మధుసూదన్, కృష్ణారెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.