తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలైన ఇద్దరు పిల్లలు

by Kalyani |
తల్లిదండ్రుల అకాల మరణంతో  అనాథలైన ఇద్దరు పిల్లలు
X

దిశ, తాడ్వాయి: చదువుకోవాల్సిన ఆ పిల్లలు విధి రాసిన రాతతో అనాథలుగా మారారు. కొన్నేళ్ల క్రితం తల్లి చనిపోగా తండ్రితో కలిసి దేవునిపల్లిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తండ్రి కూడా చనిపోవడంతో శ్రీ రుద్ర, శ్రీకర్ ఇద్దరు కుమారులు దిక్కులేని వారిగా మారారు. తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన ఆవుల మాల రాజేందర్ (45)స్వగ్రామంలో ఉండడానికి గూడు లేక దేవునిపల్లిలో ఓ ఇల్లు కిరాయి తీస్కొని ఉంటున్నాడు. దీంతో అద్దెకు తీస్కొని ఉంటున్నా ఇంట్లో రాజేందర్ కు ప్రమాదవశాత్తు పిడ్స్ వ్యాధి వచ్చి ఒక్కసారిగా క్రింద పడటంతో మెడ నరాలకు నడుము భాగాలకు బలమైన గాయాలు కావడంతో హైదరాబాద్ లోని గాంధీ,ఉస్మానియా హాస్పిటల్ లో 12 రోజులు చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడని గ్రామస్థులు తెలిపారు.

కుటుంబ పోషణకు తీసుకున్న ఆటోను అమ్మి హాస్పిటల్ లో బిల్లు చెల్లించారు. గ్రామస్థులు మిత్రుల సహకారంతో చందాల రూపంలో డబ్బు పోగుచేసి రాజేందర్ ను సాయంత్రం అంత్యక్రియలు చేశారు. పిల్లలు ఉండడానికి శాశ్వతంగా ఇల్లు లేదు. ఆలనా పాలన చదువుల నిమిత్తం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం,దాతలు ముందుకు వచ్చి ఈ పిల్లలకు చేయూతనిస్తే వారి జీవితానికి భరోసా కల్పించినట్లు అవుతుందని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story

Most Viewed