Jamaican PM: గ్లోబల్ సౌత్‌కు బలమైన స్వరంగా భారత్: జమైకా అధ్యక్షుడు

by S Gopi |
Jamaican PM: గ్లోబల్ సౌత్‌కు బలమైన స్వరంగా భారత్: జమైకా అధ్యక్షుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: గ్లోబల్ సౌత్‌కు బలమైన స్వరంగా భారత్ నిలుస్తోందని జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్‌నెస్ అన్నారు. గురువారం తన అధికారిక భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆయన.. జమైకా లాంటి దేశాలకు అభివృద్ధి మార్గాన్ని అందిస్తూనే, గ్లోబల్ సౌత్‌కు బలమైన స్వరంగా భారత్ ఉందని ప్రశంసించారు. తమ దేశానికి టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ అండ్ స్కిల్స్ వంటి అంశాల్లో అభివృద్ధి మార్గనిర్దేశం చేస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప అతిథి అంటూ ప్రశంసించిన ఆయన, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాల(ఎంఓయూ) గురించి ప్రస్తావించిన ఆండ్రూ.. మేము క్రీడలు, సంస్కృతికి సంబంధించి ఎంఓయూలపై సంతకాలు చేశాము. జమైకాలో టెక్నాలజీ, స్టెమ్ విద్య అభివృద్ధితో సహా ఇతర రంగాలను విస్తరిస్తున్నాం. ముఖ్యంగా యూపీఐకి సంబంధించి జమైకా ఆర్థికవ్యవస్థ, రక్షణ, భద్రతకు సహకారం ఉంటుందని వెల్లడించారు. భారత్-జమైకా సంబంధాల భవిష్యత్తుపై అభిప్రాయాలను పంచుకున్న ఆండ్రూ.. ఇరు దేశాల మధ్య సంబంధాలు ముందుకు సాగుతున్నాయి. ఈ పర్యటనే అందుకు సంకేతమని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed