M&M: ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన మహీంద్రా

by S Gopi |
M&M: ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన మహీంద్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. లాస్ట్ మైల్ మొబిలిటీ అవసరాలను తీర్చేందుకు ఈ విభాగంలోకి ప్రవేశించామని కంపెనీ తెలిపింది. గురువారం కంపెనీ తన మొదటి ఈవీ స్మాల్ కమర్షియల్ మోడల్ జీరో ఎమిషన్ ఆప్షన్(జియో)ను విడుదల చేసింది. రూ. 7.52 లక్షల(ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ఈ ఈవీ ఫోర్-వీలర్ 2 టన్నులలోపు బరువును మోగయలదు. ఒక్కసారి ఛార్జింగ్ ద్వారా 160 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ వాహనం 30కిలోవాట్ మోటార్, 21.3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో పనిచేస్తుంది. అలాగే, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం ద్వారా 60 నిమిషాల్లో 100 కిలోమీటర్ల ప్రయాణం కోసం ఛార్జింగ్ చేసుకోవచ్చు. 765 కిలోల వరకు పేలోడ్ సామర్థ్యంతో మెరుగైన కార్గొ స్పేస్ ద్వారా వివిధ వ్యాపార అవసరాలకు ఈ వాహనం అనుకూలమని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story