ఏసీబీ వలలో ట్రాన్స్కో చేప

by Naresh |
ఏసీబీ వలలో ట్రాన్స్కో చేప
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ వలలో ట్రాన్స్కో చేప చిక్కింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 132/11 కెవి సబ్ స్టేషన్ లో ట్రాన్స్కో కు సంబంధించి వాహనాల అద్దె చెల్లింపులో ఓ డ్రైవర్ వద్ద ఇక్కడే అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజు రూ. 12,500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వాహనాల అద్దె చెల్లింపు విషయంలో డ్రైవర్ వద్ద నుంచి నెల నెల ఇచ్చే డబ్బుల విషయంలో ఏఈ రాజు వేధింపులకు పాల్పడటంతో డ్రైవర్ భైరవ స్వామి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇందులో భాగంగా వారు వేసిన పథకం ప్రకారం రూ.12,500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాల కోసం వేధింపులకు గురి చేస్తే తమను సంప్రదించాలని జిల్లా ప్రజలను ఏసీబీ అధికారులు కోరారు.

Advertisement

Next Story