విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి.. ఎస్పీ

by Sumithra |
విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి.. ఎస్పీ
X

దిశ, జగిత్యాల టౌన్ : విజయ దశమి పండుగ ప్రజలకు అన్ని రంగాల్లో విజయం చేకూర్చాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో జిల్లా ఎస్పీ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ దశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూజా కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావ్, డీఎస్పీలు రఘు చందర్, ఉమా మహేశ్వర రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, రామకృష్ణ, వేణు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రూరల్ సీఐ కృష్ణ రెడ్డి, ఆర్ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story