పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఘనంగా దసరా వేడుకలు.. కమిషనర్

by Sumithra |   ( Updated:2024-10-12 16:53:28.0  )
పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఘనంగా దసరా వేడుకలు.. కమిషనర్
X

దిశ, కరీంనగర్ : కమిషనరేట్ కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో దసరా పండగ సందర్బంగా నిర్వహించిన ఆయుధ, వాహన పూజా కార్యక్రమాల్లో పోలీసు కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ కమిషనరేట్ ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. కమిషనరేట్ ప్రజలంతా, ఆయురారోగ్యాలతో ఉండాలని పోలీసు కమిషనర్ అభిషేక్ మొహంతి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ( శాంతి భద్రతలు ) లక్ష్మినారాయణ, ఏసీపీలు విజయ్ కుమార్ (సీసీఆర్బీ), మాధవి రిజర్వు ఇన్స్పెక్టర్లులు రజినీకాంత్, కుమారస్వామి, జానీమియా, శ్రీధర్ రెడ్డి, సీఐలు సృజన్ రెడ్డిలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story