- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ : మహేష్ కుమార్ గౌడ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారత రాష్ట్ర సమితి బీజేపీకి బీ టీమ్ ఆని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ వ్యాఖ్యానించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహేష్ కుమార్ గౌడ్ విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణలో ఏంఘనకార్యం సాధించారని జాతీయ పార్టీ పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఢిల్లీలో చక్రం తిప్పుతానంటే కేసీఆర్ ను ప్రజలు నమ్మరు అని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 24 గంటల ఉచిత కరెంటు, ఇంటికో ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీల గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి బీజేపీకి బీ టీమ్ అని మోడీ అమిత్ షాలతో కేసీఆర్ లోపాయకారి ఒప్పందంతోనే జాతీయ పార్టీగా విస్తరణ చేపట్టారని అన్నారు. కుటుంబ ప్రయోజనాల కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ, కేసీఆర్ కు త్వరలోనే ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారు అని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు.
దేశంలో ప్రజల మధ్య, ప్రాంతాలవారిగా, కులాల, మతాలవారిగా జరిగిన వైశమ్యాలను రూపుమాపేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా కోరిన షెడ్యూల్ కారణంగా 16 రోజులు మాత్రమే భారత్ జూడో పాదయాత్ర సాగుతుందన్నారు. పూర్వపు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలలో ఈ పాదయాత్ర జరుగుతుందన్నారు.
రాహుల్ గాంధీతో పాటు పార్లమెంట్ పరిధిలోని 300 మంది పైగా కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నగర అధ్యక్షుడు కేశవ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడువు గంగాధర్, సీనియర్ నాయకులు ముప్పగంగారెడ్డి, శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, ఎన్ఏస్ యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్ పాల్గొన్నారు.