అసభ్యకర మెసేజ్ లు, ఫోన్లు చేస్తూ టార్చర్

by Sridhar Babu |
అసభ్యకర మెసేజ్ లు, ఫోన్లు చేస్తూ టార్చర్
X

దిశ, భిక్కనూరు : అందమైన మహిళలే వారి టార్గెట్ గా...రెండు మూడు రోజులుగా అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ లు చేస్తూ... అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టడం, ఎవడ్రా మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారని బాధిత మహిళలు ప్రశ్నిస్తే... బూతు మాటలు మాట్లాడుతూ టార్చర్ చేయడంతో మానసికంగా కృంగిపోయిన బాధిత మహిళలు గురువారం పోలీసులను ఆశ్రయించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్కిల్ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న మహిళలకు అసభ్యకర ఫోన్లు వస్తుండడంతో ఆ టార్చర్ భరించలేక వణికిపోతున్నారు.

ఒకటి రెండు రోజులు కాదు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ ప్రాంతం నుంచి అసభ్యకర మాటలతో మెసేజ్ లు పెట్టడం, ఈ బాధ భరించలేక, సదరు ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెడితే, మరో నెంబర్ తో ఫోన్ చేసి ఆంధ్ర భాషలో మాట్లాడుతూ నువ్వంటే చాలా ఇష్టం అంటూ మాట్లాడుతున్నారు. ఎవడ్రా నువ్వు ఫోన్ మాట్లాడేది అని గట్టిగా మాట్లాడి బెదిరిస్తే ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడుతూ ఫోన్ పెట్టేస్తున్నాడు. ఫేస్ బుక్, ఇంస్ట్రా గ్రాం, ప్రొఫైల్ పిక్చర్ ల ఆధారంగా

సమాజంలో గౌరవంగా బతికే మహిళలకు ఇటువంటి ఫోన్ లు రెండు మూడు రోజులుగా వస్తుండడంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. సుమారు నెల రోజుల క్రితం ప్రముఖుని కుటుంబానికి ఇదే పరిస్థితి తలెత్తితే సెల్ నెంబర్ లొకేషన్ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి పట్టుకొని దేహ శుద్ధి చేశారు. ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ తో అసభ్యకర మాటలతో టార్చర్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Next Story