నేడు లావోస్‌కు ప్రధాని

by Mahesh Kanagandla |
నేడు లావోస్‌కు ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రెండో రోజుల లావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. లావోస్ ప్రధాని సోనెక్సే సిఫాండోన్ ఆహ్వానం మేరకు ప్రధాని లావోస్‌ వెళ్లనున్నారు.ఆసియాన్ ప్రస్తుత చైర్ లావోస్.. 21వ ఆసియాన్-ఇండియా సదస్సు నిర్వహించనుంది. ప్రధాని మోదీ తన పర్యటనలో ఈ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే 19వ ఈస్ట్ ఇండియా సదస్సులోనూ పాల్గొనబోతున్నారు. ఆసియాన్-ఇండియన్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరవ్వడం ఇది పదోసారి కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

ఆసియాన్ గ్రూపులో తూర్పు ఆసియా దేశాలు బ్రూనై, బర్మా, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు ఉన్నాయి. ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీకి పదేళ్లు నిండుతున్న సందర్భంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఆసియాన్ దేశాలతో భారత సంబంధాలు, దేశాల పురోగతిపై ప్రధాని మోదీ సమీక్ష చేసే అవకాశముంది. భవిష్యత్‌లో తీసుకునే నిర్ణయాలు, విధానాలు, సంబంధాలపైనా ప్రధాని మాట్లాడే చాన్స్ ఉన్నదని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed